మంత్రి పొన్నాల ఇంటిని ముట్టడించిన విద్యార్థులు

తెలంగాణకు మద్దతుగా నిలబడినందుకే పొన్నాల లక్ష్మయ్య తనకు 2004లో టికెట్ రాకుండా చేశారని ఎమ్మెల్సీ రాజలింగం విమర్శించారు. పొన్నాల లక్ష్మయ్య ఆంధ్రా పాలకులకు పిట్టలదొరలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణపై ఇచ్చిన హామీని కాంగ్రెసు నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. కాగా, కాంగ్రెసు శాసనసభ్యుడు టి. రాజయ్య తెలంగాణకు మద్దతు ప్రకటించారు. కాకతీయ విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా ఆయన రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులు ఇప్పటికైనా కళ్లు తెరవాలని, తెలంగాణను బలిపశువును చేయవద్దని ఆయన కోరారు. తెలంగాణకు ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం ఉద్యమించని రాజకీయ నాయకులకు రజక సంఘం, నాయీ బ్రాహ్మణ సంఘం సాంఘిక బహిష్కరణ విధించాయి. వారికి సేవలందించకూడదని ఆ సంఘాలు నిర్ణయించాయి.












Click it and Unblock the Notifications