చివరకు కెసిఆర్ కూడా మారుతారు: లగడపాటి

తనది ప్రజా ఉద్యమమని ఎవరైనా మారాల్సిందేనని ఆయన అన్నారు. తెలుగు తల్లి వస్త్రాపహరణ జరిగిందని, తెలుగు తల్లి మానాన్ని కాపాడడానికి తాము ముందుకు వచ్చామని ఆయన చెప్పారు. అన్ని ప్రాంతాల మనోభావాలకు అనుగుణంగా ఎవరికీ ఇబ్బంది కలగకుండా రాష్ట్ర సమైక్యతను కాపాడుతామని ఆయన అన్నారు. నాయకులను అర్థం చేసుకోవాలని తాను ప్రజలను కోరుతున్నట్లు ఆయన తెలిపారు. తాను దీక్ష విరమిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అందరి మనోభావాలకు అనుగుణంగా లేకపోతే విశాఖపట్నంలో దీక్ష చేస్తానని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన జరగకూడదని, పునర్వ్యస్థీకరణ జరగాలని, అది శాస్త్రీయంగా జరగాలని ఆయన అన్నారు. దీక్షలపై రాజకీయ నాయకులం కామెడీ చేశామని ఆయన చెప్పారు. మహాత్మా గాంధీ లాగా నడవాలంటే గోచీ పెట్టుకుని నడవాలంటే కష్టమని ఆయన అన్నారు.
కేంద్ర నిర్ణయం తనకు అనుకూలంగా రాదని, ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఉంటుందని, రాష్ట్రానికి అనుగుణంగా ఉంటుందని ఆయన చెప్పారు. తాను ఖూనీలు చేయలేదని, తనను నివారించడం సరైంది కాదని చెప్పానని ఆయన అన్నారు. తాను రాష్ట్రాల పునర్వస్థీకరణ కమిషన్ వేయాలని సూచించినట్లు ఆయన తెలిపారు. తన బరువు తగ్గిందని ఆయన చెప్పారు. సిద్ధిపేటలో కెసిఆర్ దీక్షను భగ్నం చేయవద్దని చెప్పిన ఏకైక నాయకుడిని తానేనని ఆయన చెప్పారు. పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.