హైదరాబాద్: కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మీడియా ప్రతినిధులతో వాగ్యుద్ధానికి దిగారు. దీక్ష విరమించిన తర్వాత సుదీర్ఘంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ చరిత్ర చెప్పడం ప్రారంభించారు. దీంతో మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేయడం ప్రారంభించారు. అయితే తాను మాట్లాడి తీరాల్సిందేనని, కొందరికి రెండున్నర గంటలు ఇస్తారని, తనకు ఎందుకు ఇవ్వరని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను ప్రెస్ మీట్ పెట్టాను కాబట్టి తాను మాట్లాడినంత సేపు వినాల్సిందేనని ఆయన పట్టుబట్టారు. తమకు చరిత్ర అవసరం లేదని మీడియా ప్రతినిధులు అన్నారు. తాను చెప్పింది చెప్పాక ప్రశ్నలు వేయాలని ఆయన పట్టుబట్టారు.
ఇష్టం లేనివారు, కష్టమనిపించినవారు, సమయం లేని వారు వెళ్లిపోవచ్చునని ఆయన అన్నారు. వినదులుచుకోలేని వాళ్లు వెళ్లిపోవచ్చునని కూడా ఆయన అన్నారు. వద్దంటే చెప్పండి వెళ్లిపోతానని కూడా ఆయన అన్నారు. చివరికి తాను మరో 15 నిమిషాలు మాట్లాడతానని చెప్పి సర్ది చెప్పారు. ఆ తర్వాత ఆయన మాట్లాడారు. తెలుగులో చెప్పిన విషయాలను ఆయన ఆంగ్లంలో కూడా వివరించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి