కలత చెందే రాజీనామా చేశాను: లడగపాటి

హైదరాబాదులోని ఫలక్ నుమా వద్ద చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసి విజయవాడకు తరలించడం బాధాకరమని ఆయన అన్నారు. తనను హైదరాబాద్ తరలిస్తేనే చికిత్స అంగీకరిస్తానని పట్టు బట్టినట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు తాను ఎన్నేళ్లయినా బతకగలిగే దీక్షలు వచ్చాయని ఆయన అన్నారు. ఈ సత్యం చెప్పేందుకే తాను దీక్షకు దిగినట్లు ఆయన తెలిపారు. తాను విజయవాడలో ఎప్పుడు కూడా పోలీసుల నిర్బంధంలో లేనని ఆయన అన్నారు. హైదరాబాద్ రానీయకపోవడం తన హక్కుకు భంగం కలిగించడమని భావించానని ఆయన చెప్పారు. ధర్మబద్ధం, న్యాయబద్దం కాకపోయినా తనను నిమ్స్ కు రాకుండా చేశారని, ఈ ప్రభుత్వ యంత్రాంగానికి కనువిప్పు కలిగించాలని తాను హైదరాబాద్ వచ్చానని ఆయన చెప్పారు.
తెలంగాణలోని నాలుగు జిల్లాలు తిరిగి హైదరాబాద్ వచ్చినట్లు ఆయన తెలిపారు. పోలీసులకు, అరాచక శక్తులకు భయపడి నిమ్స్ కు రాకపోతే సామాన్యులు ఎలా వస్తారని తాను భావించి వచ్చానని ఆయన అన్నారు. పోలీసులు ఎవరు గుర్తించకపోయినా మీడియా ప్రతినిధులు ఎలా గుర్తించారో తనకు అర్థం కాలేదని ఆయన అన్నారు. వెనక్కి తిరిగి చూసే సరికి తనకు నవ్వు వచ్చిందని ఆయన అన్నారు. తాను మీడియాతో మాట్లాడడానికి రాలేదని, 48 గంటలు నిమ్స్ లో ఎవరితో మాట్లాడకుండా ఉండాలని అనుకున్నానని ఆయన చెప్పారు. తన దీక్ష 19వ తేదీ సాయంత్రమే అయిపోయిందని ఆయన అన్నారు.