వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వరంగల్: లగడపాటి దిష్టిబొమ్మ దగ్ధం

ఈ సందర్భంగా పసునూరి దయాకర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పార్టీలకు అతీతంగా ఒక్కటయ్యారని అన్నారు. తెలంగాణ ప్రక్రియలో ఏమాత్రం ఆటంకం కలిగినా జరిగే పరిణామాలకు సీఎం రోశయ్య బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. లగడపాటిని వెంటనే అరెస్టు చేసి జైల్లో పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు గుజ్జ సంపత్‌రెడ్డి, పి.ఏకాంతం, వన్నాల శ్రీనివాస్, ఎండీ.అన్వర్, ఎమ్మార్పీఎస్ నాయకులు మరపట్ల అంజయ్య, ప్రజాపార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లెపాక చంద్రమౌళి, కార్మిక సంఘం నాయకులు బి.ఆరోగ్యం, మునిగాల రాములు, సోమేశ్వర్, విద్యార్థి నాయకులు రాములు పాల్గొన్నారు.'