వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కేంద్రానికి మధు యాష్కీ తీవ్ర హెచ్చరిక

తాము తెలంగాణను విడదీయమంటున్నాం గానీ ప్రజలను కాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇక్కడి తెలంగాణేతరలకు కష్టం, నష్టం ఏదీ లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడాన్ని రాయలసీమ, ఆంధ్రా ప్రజాప్రతినిధులు మానుకోవాలని ఆయన సూచించారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని, తేడా వస్తే తమ తడాఖా చూపిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ ఎంపీలంతా ఢిల్లీకి రావాలని తమ కాంగ్రెసు పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ నుంచి పిలుపు వచ్చినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే మునుపెన్నడూ లేనంతగా పోరు ఎగిసిపడుతుందని ఆయన చెప్పారు.