వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమైక్యాంధ్ర ఆందోళన వెనక వైయస్ జగన్?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రకటన వెలువడిన వెంటనే కాంగ్రెసులో తీవ్ర వ్యతిరేకత వచ్చి సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభం కావడం వెనక కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి కాంగ్రెసు అధిష్టానం వద్ద స్పష్టమైన సమాచారం ఉందని చెబుతున్నారు. అందుకే సమైక్యాంధ్రవాదుల డిమాండ్లకు తలొగ్గడానికి సిద్ధంగా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైయస్ జగన్ పాత్ర ఉందనడానికి తగిన రుజువులు కూడా లభిస్తున్నాయి. మంగళవారం విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం విద్యార్థులు దీక్ష విరమించారు. వైయస్ జగన్ సూచన మేరకే తాము దీక్ష విరమించామని విద్యార్థి నాయకులు చెప్పారు. ప్రాణాలు ఉంటే ఏమైనా సాధించవచ్చు, ప్రాణాలు పోతే ఏమీ చేయలేమని చెప్పి జగన్ తమను దీక్ష విరమించాలని చెప్పారని విద్యార్థులు చెబుతున్నారు. దీన్ని బట్టి దీక్షల వెనక, ఆందోళన వెనక జగన్ పాత్ర స్పష్టమవుతోంది.

కాగా, ఆందోళనలకు దిగిన కాంగ్రెసు నాయకులు కూడా వైయస్ జగన్ సన్నిహితులే కావడం విశేషం. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రకటన వెలువడిన వెంటనే పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి ఆమరణ నిరాహార దీక్షకు దిగిన లగడపాటి రాజగోపాల్ జగన్ కు అత్యంత సన్నిహితుడు. వీరిద్దరికి మధ్య వ్యాపార లావాదేవీలున్నాయని తరుచూ వినిపిస్తూనే ఉన్నది. జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని పట్టుబట్టినవారిలో లగడపాటి కూడా ప్రముఖుడు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి రాయలసీమ, కోస్తాంధ్ర మంత్రులకు నాయకత్వం వహించింది కూడా జగన్ కు అత్యంత సన్నిహితుడైన ఆనం రామనారాయణ రెడ్డి. అలాగే, సీమాంధ్ర శాసనసభ్యులకు కూడగట్టి కేంద్ర ప్రభుత్వంపై, కాంగ్రెసు అధిష్టానంపై తీవ్రంగా ధ్వజమెత్తిన కాంగ్రెసు శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి జగన్ కోసం ఎంత దూరమైన పోవడానికి సిద్ధపడి ఉన్నవారు.

కడప జిల్లాలో ఆమరణ దీక్షకు దిగిన ఎమ్మెల్సీ వైయస్ వివేకానంద రెడ్డి స్వయంగా జగన్ చిన్నాన్న. కడప జిల్లాలోని, రాయలసీమ జిల్లాలోని కాంగ్రెసు నాయకులు చాలా వరకు జగన్ కు అనుకూలంగా ఉన్నవారే. తెలుగుదేశం పార్టీతో కలిసి రాష్ట్రంలో రోశయ్య ప్రభుత్వాన్ని సంక్షోభంలో పడేయడానికి జగన్ వ్యూహరచన చేసినట్లు ఉప్పందుకున్న పార్టీ అధిష్టానం జగన్ కు తెలంగాణ పార్టీ నాయకులు మద్దతు లేకుండా చేయడానికి, తెలంగాణకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి చిదంబరం చేత పకడ్బందీ ప్రకటన చేయించినట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ చర్యలు పార్లమెంటులో కూడా బహిర్గతమైన నేపథ్యంలో పార్టీ అధిష్టానం కచ్చితంగా ఉన్నట్లు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X