హైదరాబాద్: తాను కూడా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. తాను ఢిల్లీ ఉండడం వల్ల గురువారం రాత్రి మంత్రి డికె అరుణ నివాసంలో జరిగిన తెలంగాణ మంత్రుల సమావేశానికి హాజరు కాలేకపోయానని, తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన శుక్రవారం ఉదయం వివరణ ఇచ్చారు.
తన మామ పొన్నాల లక్ష్మయ్య కూడా రాజీనామా చేయాలని ఆయన కోడలు, కాంగ్రెసు నాయకురాలు వైశాలి గురువారం వరంగల్ జిల్లాలో జరిగిన ఒక తెలంగాణ కార్యక్రమంలో డిమాండ్ చేశారు. హైదరాబాదుకు చెందిన మంత్రి ముఖేష్ గౌడ్ మాత్రం రాజీనామా చేయడం లేదు. ఆయన తెలంగాణ మంత్రులతో విభేదిస్తున్నారు. హైదరాబాద్ విషయం తమతో మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని ఆయన వాదిస్తూ వస్తున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి