వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కమిటీకి సమైక్యవాదులు: వద్దన్న తెలంగాణవాదులు

చర్చల విధానాన్ని ముందుగా ఖరారు చేయాలని మజ్లీస్ ప్రతినిధులు సూచించినట్లు సమాచారం. కాగా, రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొనాలని అన్ని రాజకీయ పార్టీలు సూచించినట్లు తెలుస్తోంది. రెండు ప్రాంతాలకు చెందినవారు కూడా శాంతించి తమకు సహకరించాలని చిదంబరం రాజకీయ పార్టీలకు సూచించారు. ప్రజారాజ్యం పార్టీ సమైక్యవాదాన్ని బలంగా వినిపించినట్లు సమాచారం. తమది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని, యాభై ఏళ్లుగా నలుగుతున్న విషయమని, తమకు రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు కాల పరిమితి విధిస్తూ ప్రకటన చేయాలని తెలంగాణవాదులు కోరినట్లు చేసినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ స్థాయి కమిటీ వేయాలన్న సూచనను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రతినిధులతో పాటు ఇతర పార్టీలకు చెందిన తెలంగాణ ప్రతినిధులు వ్యతిరేకించినట్లు సమాచారం.