శని-చంద్రుల సంయోగంతో త్వరలో విష యోగం: ఈ రాశులకు ధన లాభం!

వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాల్లో శని, చంద్ర గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. శనిని న్యాయానికి, కర్మఫలాలకు అధిపతిగా భావిస్తారు. చంద్రుడు మనస్సు, భావోద్వేగాలకు ప్రతీకగా చెప్తారు. ఈ రెండు గ్రహాల సంయోగం జ్యోతిష్యపరంగా అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు.

మీనంలో శని-చంద్రుల సంయోగం

ఈ ఏడాది మే 12న సాయంత్రం 7:24 గంటలకు గురు గ్రహ అధిపత్య రాశి అయిన మీనంలో శని-చంద్రుల సంయోగం జరగనుంది. ఈ ప్రభావం దాదాపు రెండు రోజులపాటు కొనసాగుతుంది. ఈ కలయికను 'విష యోగం'గా చెప్తారు, ఇది సాధారణంగా అశుభకరమైనదిగా భావించినప్పటికీ, కొన్ని రాశుల జాతకాల్లో బలమైన స్థానంలో ఏర్పడటం శుభ ఫలితాలను ఇస్తుంది. ఆ రాశులు ఏమిటో చూద్దాం.

visha yoga with Saturn Moon Conjunction Visha Yoga Benefits these zodiac signs wealth and health

మేష రాశి

మేషరాశి వారికి శని, చంద్రుల సంయోగం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి . వ్యాపారస్తులు మంచి లాభాలను ఆర్జించగలరు. ముఖ్యమైన పనులను సమయానికి పూర్తి చేసే అవకాశం ఉంది. పెళ్ళికాని వారికి మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి. మీ చిరకాల కోరికలు నెరవేరతాయి, శని దేవుడి అనుగ్రహంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సమయంలో మీ మేధస్సు మెరుగుపడుతుంది. స్నేహితులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. మీ ఆదాయాన్ని పెంచుకోవచ్చు.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి శని-చంద్రుల సంయోగం శుభ ఫలితాలను అందించనుంది. కుటుంబ సభ్యులతో కర్కాటక రాశి జాతకులు ఆనందంగా గడుపుతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. మీరు చేపట్టే పనులన్నింటిలో విజయం సాధిస్తారు. కోర్టు కేసులలో మీకు అనుకూలంగా తీర్పు రావొచ్చు. వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

కన్య రాశి

కన్య రాశి వారికి ఏడవ స్థానంలో శని-చంద్రుల కలయిక జరగబోతోంది. దీనివల్ల వీరికి ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. వ్యాపారస్తులు అద్భుతమైన ఫలితాలను చూసి ఆనందిస్తారు. ఉద్యోగులకు పదోన్నతికి సంబంధించి శుభవార్తలు వినిపిస్తాయి. కెరీర్ లో పురోగతి ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో అద్భుతంగా రాణించగలరు. ఈ కాలంలో మీ ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశం ఉంది.

తులా రాశి

గురు రాశిలో ఏర్పడుతున్న ఈ శక్తివంతమైన యోగం తుల రాశి వారికి శుభాన్ని చేకూర్చనుంది. శని, చంద్రుల ప్రభావంతో మీరు అనేక రంగాల్లో ప్రయోజనాలు పొందుతారు. మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధించగలరు. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. దీనివల్ల మీ సంపద పెరుగుతుంది. ఆర్థికంగా త్వరగా స్థిరపడే అవకాశాలున్నాయి.

మకర రాశి

మకర రాశి వారికి మూడవ స్థానంలో శని-చంద్రుల కలయిక ప్రభావం చూపనుంది. ఈ సమయంలో మీ కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి. ఆకస్మిక ధన లాభాలు, సంపద వృద్ధిని చూడవచ్చు. ఉద్యోగులకు పదోన్నతికి సంబంధించిన శుభవార్తలు వినబడవచ్చు. కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. మీరు చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష నిపుణుల సూచనలు, ఇంటర్నెట్లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు, పూర్తి వివరాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించగలరు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+