వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
48 గంటల బంద్ లతో సామాన్యుల బెంబేలు

పదివేల ఆర్టీసీ బస్సులు బుధవారం ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. గురువారం కూడా అదే పరిస్ధితి ఉండబోతోంది. తెలంగాణ నాయకులు మాత్రం ఈ కొద్ది అసౌకర్యాన్ని భరించమని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమీపించిందని సర్దిచెబుతున్నారు. బస్సులు లేకపోవడంతో ఆంధ్రప్రాంతం నుంచి రాజధాని హైదరాబాద్ కు రావలసిఉన్న సామాన్యులకు నరకమే కన్పిస్తోంది. మరీ ముఖ్యంగా వైద్య సేవల కోసం రావలసి ఉన్న రోగులు సతమతమవుతున్నారు. రైళ్ళు కిటకిటలాడుతున్నాయి.
బంద్ లు పోలీసు సిబ్బందికి కూడా అగ్ని పరీక్షలా మారాయి. సెలవులు లేక వారు సతమతమవుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో రెండు వేల మంది పోలీసులు మోహరించి ఉన్నారు. జూబ్లీహాలులో సీఎం అధ్యక్షతన రేపు జరగాల్సిన ఎస్పీల సమావేశం వాయిదా పడింది. శాంతిభద్రతల దృష్ట్యా సమావేశం వాయిదా వేసినట్లు సమాచారం.