తెలంగాణపై కాంగ్రెసు వాళ్లమంతా కలుద్దాం: జెసి దివాకర్ రెడ్డి

తమ కాంగ్రెసు నాయకులంతా కలిసి ఉంటే తెలంగాణ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణపై మంచైనా చెడైనా కాంగ్రెసు నిర్ణయం తీసుకోవాల్సిందేనని, అనుభవించాల్సింది కూడా కాంగ్రెసేనని, అందువల్ల అందరం కలిసే ఏదో ఒక నిర్ణయానికి రావడం మంచిదని ఆయన అన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత తమ పార్టీ తెలంగాణ సీనియర్ సభ్యులు కె. జానా రెడ్డి, ఆర్ దామోదర్ రెడ్డిలతో చర్చిస్తానని ఆయన చెప్పారు. ఇంతకు ముందు జెసి దివాకర్ రెడ్డి ప్రాంతాలకు అతీతంగా పార్టీ శాసనసభ్యులను విందుకు ఆహ్వానించారు. అయితే తెలంగాణ శాసనసభ్యులు దాన్ని పట్టించుకోలేదు. దాంతో ఆయన ప్రయత్నం విఫలమైంది. మరోసారి ఆయన అటువంటి ప్రయత్నానికి పూనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications