నేడుగుమ్మడి అంత్యక్రియలు: సొంతపొలంలోనే

గుమ్మడి తల్లిదండ్రులు గుమ్మడి బసవపున్నయ్య, బుచ్చమ్మ. ఐదుగురు బిడ్డల్లో గుమ్మడి వెంకటేశ్వరరావు పెద్దకుమారుడు. ఈయన విద్యాభ్యాసం, కొల్లూరు, గుంటూరులో జరిగింది. కొల్లూరు జెడ్పీ హైస్కూల్లో చదువుతుండగా తెలుగుపండిట్ జాష్టి శ్రీరాములు తెలుగుభాష, సంస్కృతులపై ఆయనకు స్ఫూర్తిదాతగా నిలిచారు. ముసలిపాడు గ్రామానికి చెందిన లకీసరస్వతితో వివాహంకాగా, భార్య మేనమామ అయిన వట్టికూటి రామకోటేశ్వరరావు ఆయనను ఎంతగానో ప్రోత్సహించారు. గుమ్మడికి ఏడుగురు సంతానం. వీరిలో ఐదుగురు అమ్మాయిలు, ఇద్దరుఅబ్బాయిలు. వీరిలో ఇద్దరు అమెరికాలో ఉంటున్నారు. మిగిలినవారు వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు. 'అగ్నిపూలు' సినిమాలో నటించిన తర్వాత ఆ సినిమాలో ఉన్న తంగేడుచెట్టును తన స్వగృహం వద్ద నాటాలని భావించి, తల్లి బుచ్చమ్మతో తంగేడు మొక్క నాటించినట్టు ఆయన చెల్లెలు కామినేని సీతామహాలకి తెలిపారు. రావికంపాడులో తనకు ఎంతో ఇష్టమైన గ్రంథాలయానికి సొంత భవనం నిర్మించారు. దళితవాడలో చర్చి, కొల్లూరు జెడ్పీ హైస్కూల్‌లో చదువుకున్నందుకు గుర్తుగా స్కూల్ ఆవరణలో 'గుమ్మడి కళామందిర్'ను ఆయన నిర్మించారు.