కడప: కడప జిల్లా ప్రొద్దుటూరులో జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని అయిన అంజనాదేవి(17) శనివారం సూపర్ వాస్మాల్ తాగి ఆస్పత్రిపాలైంది. ఆమె తల్లి రామలక్షుమ్మ కథనం ప్రకారం... జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదంలో గాయపడినప్పుడు పదో తరగతి పరీక్షలు రాయకుండా ఆయన త్వరగా కోలుకోవాలని అన్ని ఆలయాల్లో పూజలు చేయించింది.
ఇటీవల టీవీ లైవ్‌షోలో ఆయనతో ఫోన్‌లో సంభాషించిన తర్వాత నేరుగా మాట్లాడాలన్న తపనతో పలుమార్లు హైదరాబాద్‌కు ఫోన్‌చేసి ఆశాభంగానికి గురైంది. ఆయనకు వివాహం నిశ్చయమైనట్లు వార్తలు రావడంతో ఇక మాట్లాడరేమోనన్న కలతతో ఆత్మహత్యకు యత్నించగా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి