గుంటూరు: కేంద్రప్రభుత్వం వేయబోయే కమిటీని వ్యతిరేకిస్తున్నామని, దీన్ని అడ్డుకుంటామని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. కేంద్రం కమిటీ వేయడం సరికాదని తెలిపారు. విభజన అంటూ జరిగితే ముందు తమిళనాడును విభజించాలని డిమాండ్ చేశారు. చిదంబరం చర్యలను అనుమానిస్తున్నామని తెలిపారు. సీమాంధ్ర ఎంపీలను సంప్రదించకుండా చిదంబరం ప్రకటించడాన్ని తప్పుపట్టారు. కాంగ్రెస్ తెలంగాణ నేతలు జేఏసీలో చేరడమంటే పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించడమేనని అన్నారు.
రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్ ఎంపీ. ఆయన సమైక్యవాది. కోస్తా ఆంధ్రకు చెందిన కమ్మవారందరూ సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు. తెలంగాణకు చెందిన రెడ్లు మాత్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి