తెలంగాణ మంటలార్పే పని నాది: జస్టిస్ శ్రీకృష్ణ

Justice Srikrishna
బెంగళూరు: ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే తాను నిప్పును ఆర్పే ఉద్యోగి(ఫైర్‌ ఫైటర్‌) మాదిరిగా ఉపయోగపడుతున్నానని ఆంధ్రప్రదేశ్‌ సంప్రదింపుల కమిటీ ఛైర్మన్‌ జస్టిస్‌ శ్రీకృష్ణ వ్యాఖ్యానించారు. బెంగళూరులో శనివారం జరిగిన ఎస్‌.ఆర్‌.రామకృష్ణన్‌ స్మారకోపన్యాసంలో ఆయన మాట్లాడారు. ఆయన మంటలు ఆర్పుతారా, మంటలను విభజించి రెండు చోట్ల వంటలు చేయిస్తారా అన్నది వేచి చూడాల్సిందే. ఆయన ఉపన్యాసం సారాంశమిది.

''గతంలో ఉద్యోగుల సమ్మె సందర్భంగా ఆందోళనకు గురైన కేంద్ర ప్రభుత్వం ఆ సమస్య పరిష్కార బాధ్యతలు నాకు అప్పగించింది. మద్రాస్‌ హైకోర్టులో న్యాయవాదుల ఘర్షణల సందర్భంగా రాజుకున్న నిప్పును ఆర్పమని నన్ను అడిగారు. ఇక తెలంగాణలో నిజంగానే మంటలు మండుతున్న సమయంలో ఆ సమస్యను పరిష్కరించే బాధ్యతను కేంద్ర హోంమంత్రి నాకు అప్పగించారు. తప్పనిసరిగా సాయపడాలని చిదంబరం స్వయంగా నన్ను కోరారు. బహుశా ఫైర్‌ ఫైటర్‌ లక్షణాలు, అర్హతలు నాలో ఉన్నాయనుకుంటున్నాను. సమస్యల పరిష్కారానికి ఇవన్నీ ఉపయోగపడగలవని ఆశిస్తున్నాను'' అని జస్టిస్‌ శ్రీకృష్ణ అన్నారు. స్మారకోపన్యాసంలో చేసిన ఈ వ్యాఖ్యలు మినహా తెలంగాణ అంశంపై విలేకర్లు అడిగిన ప్రశ్నలను ఆయన సున్నితంగా తిరస్కరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+