Viral Video: కొండ కుప్పకూలి దూసుకొచ్చిన ట్యాంకర్-ఆ ముగ్గురు-ఒళ్లు గగుర్పొడిచే వీడియో..!
కేరళలోని వయనాడ్ (Wayanad) లో కురుస్తున్న భారీ వర్షాలకు ఇవాళ ఓ కుండ ఉన్నట్లుండి కుప్పకూలింది (Landslide). దీంతో అప్పటి వరకూ ఆ కొండ చుట్టుపక్కల ఉన్న వారంతా షాకయ్యారు. రెప్పపాటులో తప్పించుకునేందుకు పరుగులు తీశారు. అదే సమయంలో అక్కడే ఉంచిన ఓ ఆయిల్ ట్యాంకర్ ను తోసుకుంటూ కొండ చరియలు మనుషులపైకి దూసుకొచ్చాయి. వెంటనే గమనించి అక్కడ ఉన్న ముగ్గురు పరుగులు తీసేందుకు ప్రయత్నించారు. కానీ ఆ ట్యాంకర్ వారి పైకి దూసుకొచ్చింది. చివరికి వీరు తృటిలో తప్పించుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ (Viral Video) అవుతోంది.
వయనాడ్ లో భారీ కొండచరియలు విరిగిపడి రహదారిపై కొన్ని క్షణాల్లో ఒక ట్యాంకర్‌ను, అనేక వాహనాలు కొట్టుకుపోయిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. భూమి అకస్మాత్తుగా కుంగిపోవడంతో, టన్నుల కొద్దీ మట్టి, శిథిలాలు కొండ కిందికి దూసుకువస్తుండగా, ప్రజలు గొడుగుల కింద నిలబడి దూరం నుండి చూస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. ఆ ట్యాంకర్ దాదాపు 100 అడుగుల లోతుకు పడిపోయిందని, అందులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారని సమాచారం.

అనక్కంపొయిల్-కల్లాడి టన్నెల్ రోడ్ ప్రాజెక్ట్ సైట్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో కనీసం ఐదుగురు మరణించగా, మరో నలుగురు గల్లంతయ్యారు, 10 మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్నారని భావిస్తున్న వారిని గుర్తించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల తర్వాత ఈ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి విస్తృత విధ్వంసం సృష్టించాయి. టన్నెల్ ప్రాజెక్ట్ సైట్‌లోని కొన్ని భాగాలను కబళించడమే కాకుండా, ఈ కొండచరియలు ఒక చర్చిని, సమీపంలోని ఇంటిని కూడా కొట్టుకుపోయాయి. అదృష్టవశాత్తు, ఈ రెండు కట్టడాలలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అందులో నివసించేవారు తీర్థయాత్ర కోసం మక్కాకు వెళ్లడంతో ఇంటికి తాళం వేసి ఉంది, అయితే ఇది జరిగినప్పుడు చర్చిలో ఎవరూ లేరు.














Click it and Unblock the Notifications