గుంటూరు జిల్లాకు వస్తున్న అపాచీ షూ కంపెనీ

ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ కంపెనీ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపడతామని కంపెనీ ప్రతినిధి చెన్‌కు హామీ ఇచ్చారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. పొత్తూరు సమీపంలోని పరిస్థితులను కంపెనీ ప్రతినిధికి కలెక్టర్ కూలంకషంగా వివరించారు. కంపెనీ స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉందన్నారు. ఆండ్రూ చెన్ మాట్లాడుతూ 15 రోజుల్లో మరోసారి గుంటూరుకు రానున్నట్లు తెలిపారు. ఆ సమయానికి తగిన ప్రణాళికలను రూపొందించి ఇవ్వాలని కోరారు. కంపెనీ స్థాపనకు 20 నుంచి 25 ఎకరాల భూమి అవసరం అవుతుందని, కంపెనీ ఏర్పాటుకు వనరులు సమకూర్చాలని చెన్ కోరారు.












Click it and Unblock the Notifications