‘పుష్ప’ సినిమా సిరీస్ తరహాలో మరో సినిమా సిరీస్ సిద్ధం చేస్తున్న అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న 'రాకా' చిత్రం ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్. 'పుష్ప'తో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన బన్నీ, ఇప్పుడు అంతకు మించిన పవర్‌ఫుల్ బ్రాండ్‌ను క్రియేట్ చేసేందుకు సిద్ధమయ్యారు. 'రాకా' అనే టైటిల్ వినగానే అందరి మైండ్ లో 'పుష్ప' సినిమా మెదులుతోంది. అయితే టెక్నికల్‌గా ఈ రెండు సినిమాల కథలకు ఎలాంటి సంబంధం లేదు. కానీ, ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్ పేరునే సినిమా టైటిల్‌గా పెట్టి, దాన్ని ఒక బ్రాండ్‌గా మార్చే 'పుష్ప ఫార్ములా'ను ఇక్కడ కూడా పాటిస్తున్నారు. 'పుష్పరాజ్' అనే పేరు దేశవ్యాప్తంగా ఎలాగైతే ఒక ఎమోషన్ అయిందో, 'రాకా'ను కూడా అదే స్థాయిలో నిలబెట్టాలన్నది అట్లీ ప్లాన్.
రాకా అంటే అర్థం ఏంటి?
'రాకా' అంటే సంస్కృతంలో 'పౌర్ణమి' అని అర్థం. ప్రచార చిత్రాల్లో బన్నీ లుక్ చూస్తుంటే.. చీకటిని చీల్చుకుంటూ వచ్చే వెన్నెలలా కాకుండా, విధ్వంసాన్ని సృష్టించే పవర్‌ఫుల్ శక్తిలా ఈ పాత్ర ఉండబోతోందని తెలుస్తోంది. ఫస్ట్ లుక్‌లో గుండుతో, కళ్లకు కాటుకతో, జంతువుల గోళ్లను తలపించే ఆభరణాలతో అల్లు అర్జున్ కనిపించిన తీరు.. ఇది ఒక సాదాసీదా మాస్ సినిమా కాదని, ఒక విభిన్నమైన ప్రపంచమని అర్థమవుతోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్టులలో ఒకటిగా నిలవబోతోంది. దాదాపు రూ. 800 కోట్ల బడ్జెట్ లో విజువల్ ఎఫెక్ట్స్ కోసమే రూ.250 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

మల్టీరోల్స్ చేస్తున్న బన్నీ
అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణె నటిస్తుండగా.. జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, టైగర్ ష్రాఫ్ వంటి భారీ స్టార్ కాస్ట్ ఇందులో భాగమైంది. ఈ సినిమాలో బన్నీ తాత, తండ్రి, ఇద్దరు కొడుకులుగా.. ఇలా నాలుగు విభిన్న పాత్రల్లో కనిపిస్తారనే ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దర్శకుడు అట్లీ ఈ కథను 18 ఏళ్లుగా తన దగ్గరుంచుకున్నారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆయన ఎమోషనల్‌గా చెప్పుకొచ్చారు. మరోవైపు, ఈ సినిమా కోసం అల్లు అర్జున్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ రూ.175 కోట్లు అని, లాభాల్లో 15% వాటా కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక రికార్డ్.












Click it and Unblock the Notifications