వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం కన్నుమూత

By Pratap
|
Google Oneindia TeluguNews

Padmanabham
చెన్నై: ప్రముఖ తెలుగు హాస్యనటుడు పద్మనాభం శనివారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మరణించారు. ఆయన వయస్సు 79 ఏళ్లు. దశాబ్దాల పాటు ఆయన తెలుగు ప్రేక్షకులను తన సునిశితమైన హాస్యంతో అలరించిన పద్మనాభం ఇక లేరు. పద్మనాభంగా తెలుగు ప్రజానీకానికి సుపరిచితుడైన బసవరాజు వెంకట పద్మనాభ రావు 1931 ఆగస్టు 20వ తేదీన కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రీపురంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సంతానం, బసవరాజు వెంకట శేషయ్య. మంచి ఆరోగ్యంతో ఉన్న పద్మనాభం 2006లో తన 75వ జన్మదినాన్ని జరుపుకున్నారు. గత 52 ఏళ్లుగా ఆయన యోగా చేస్తున్నారు. ఇటీవల ఆయన చక్రం, టాటా బిర్లా మధ్యలో లైలా అనే సినిమాల్లో నటించారు.

ప్రాథమిక పద్మనాభం థియేటర్ ఆర్టిస్టు. చలన చిత్ర నటుడిగా విశేషంగా విజయం సాధించినప్పటికీ తనకు కన్నతల్లి లాంటి థియేటర్ ను ఆయన వదిలిపెట్టలేదు. తన మిత్రులు వల్లం నరసింహారావు, రేఖ, మురళిలతో కలిసి సంగీత దర్శకుడు ఎస్సీ కోదండపాణి సహకారంతో థియేటర్ గ్రూపును ఏర్పాటు చేశారు. 1945లో ఆయన మాయాలోకం చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. పాతాళభైరవి సినిమాలో డింగిరి పాత్రలో పద్మనాభం అలరించిన తీరు తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. అలాగే కాళహస్తీశ్వర మహత్మ్యంలో కాశి పాత్ర కూడా ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. కుటుంబ గౌరవం, మూగ మనసులు, ఆత్మబంధువు వంటి పలు హిట్ చిత్రాల్లో ఆయన నటించారు. ఆయన 60కి పైగా చిత్రాల్లో నటించారు.

నిర్మాతగా పద్మనాభం కథానాయిక మొల్ల, శ్రీరామ కథ, శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న, పొట్టి ప్లీడర్, దేవత వంటి చిత్రాలు నిర్మించారు. దీన్ని బట్టి ఆయన అభిరుచి ఎంత ఉన్నతమైందో అర్థమవుతుంది. వీటిలో కథానాయిక మొల్ల, శ్రీరామ కథ చిత్రాలకు ఆయనే దర్శకత్వం వహించారు. ఆయన సీరియస్ పాత్రల్లో కూడా విశేషంగా రాణించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X