హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 22, 23 తేదీల్లో జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ వై.సి.వేణుధర్ శనివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంబీఏ మినహా ఇంజినీరింగ్ కోర్సుల పరీక్షలు యథావిధిగా జరుగుతాయన్నారు. ప్రొఫెసర్ జి.రామిరెడ్డి దూరవిద్యాకేంద్రంలో ఈనెల 21 నుంచి నిర్వహించనున్న వీకెండ్ కాంటాక్ట్ క్లాసులను చేస్తున్నట్లు తెలిపారు.