పిల్లలకు ఇష్టమైన పల్లి చిక్కి.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..!
వేసవి సెలవుల్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు. వారికోసం పేరెంట్స్ రకరకాల ఫుడ్ ఐటెమ్స్ ను ఆర్డర్ చేస్తుంటారు. వాటిల్లో పిల్లలు ఇష్టంగా తినే పల్లి చిక్కి కూడా ఒకటి. అయితే బయట చేసినదానికంటే రుచిగా పల్లి చిక్కి తయారు చేసుకోవచ్చు. మరి ఇంట్లోనే ఈజీగా పల్లి చిక్కి ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
పల్లి చిక్కి తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే ముందుగా వేరు శనగ పప్పు ఒక కప్పు తీసుకోవాలి. అవి వేయించి, పొట్టు తీసినవి అయి ఉండాలి. అలాగే బెల్లం ఒక కప్పు, నెయ్యి ఒక టేబుల్ స్పూన్, యాలకుల పొడి చిటికెడు తీసుకోవాలి. ఇప్పుడు తక్కువ పదార్థాలతో పల్లి చిక్కి తయారీ విధానం చూస్తే.. ముందుగా పల్లీలను వేయించుకోవాలి. అలా వేయించిన పల్లీలను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకోవాలి. ఆ పాన్ లో బెల్లం, నెయ్యి వేయాలి. అలా సన్నటి మంటపై కరిగించుకోవాలి.

ఇప్పుడు పాకం ముదురుపాకం వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఆ పాకంలో వేయించిన పల్లీలు, యాలకుల పొడి వేసి త్వరగా లేట్ చేయకుండా కలపాలి. అలాగే ఒక ప్లేట్ లో నెయ్యి రాసి ఆ మిశ్రమాన్ని వేసి సమానంగా పరచుకోవాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత పల్లి చిక్కిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే సూపర్ టేస్టీ పల్లి చిక్కి రెడీ అయినట్టే.. మీరూ ఇంట్లో ఓసారి ట్రై చేయండి.. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది.












Click it and Unblock the Notifications