భారత్ ను చూసి నేర్చుకోండి- అర్జంట్ గా ఆ బిల్లు తీసుకురండి

అమెరికా ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రతిపాదనలు తెరమీదికి తీసుకొచ్చారు. ఇక్కడి ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ బూత్ ల నిర్వహణ, ఓటర్ ఐడీ విధానాన్ని ఆయన ఉదహరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అడిగిన ఓ ప్రశ్నను ట్రంప్ ఈ సందర్భంగా ఉటంకించారు. అమెరికాలో కూడా ప్రతి ఓటరుకు ఫొటో గుర్తింపు కార్డును జారీ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ పై దీనికి సంబంధించిన వివరాలను పోస్ట్ చేశారాయన. ఇటీవల ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన పరిపాలనా విధానాన్ని ఒక ప్రశ్న అడిగారని గుర్తు చేశారు. ''అమెరికా వంటి గొప్ప దేశంలో ఓటర్లకు కనీసం ఫొటో గుర్తింపు కార్డు కూడా లేకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తున్నారు..'' అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు వివరించారు. దీని ఆధారంగానే అమెరికాలో ఎన్నికలకు సంబంధించిన ఓ సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని భావిస్తోన్నట్లు చెప్పారు.

Trump Claims Every India Voter Had a Valid ID Presses Congress for Stricter US Voting Rules save act

భారత్ లో సార్వత్రిక ఎన్నికల వివరాలను ఈ సందర్భంగా ట్రంప్.. అమెరికా ప్రజల ముందు ఉంచారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ను అభివర్ణించారు. దాదాపు 646,000,000 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, వారందరి వద్ద ప్రభుత్వం ఇచ్చిన ఫొటో గుర్తింపు కార్డులు ఉన్నాయని స్పష్టం చేశారు. భారత్‌లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన వారు ఒక శాతం కంటే తక్కువగానే ఉన్నారని వివరించారు.

డొనాల్డ్ ట్రంప్ టీమ్ లో బిగ్ వికెట్ డౌన్
డొనాల్డ్ ట్రంప్ టీమ్ లో బిగ్ వికెట్ డౌన్

అమెరికా ఎన్నికల్లో తీసుకురావాల్సిన సంస్కరణల కోసం సేవ్ అమెరికా యాక్ట్ (SAVE America Act) ఆమోదం పొందాల్సిన అవసరాన్ని ట్రంప్ తేల్చి చెప్పారు. ఈ చట్టం ప్రకారం పౌరులు ఓటరుగా నమోదు చేసుకునే సమయంలో అమెరికా పౌరసత్వ రుజువులను చూపించడం తప్పనిసరి అవుతుంది. దీనితో పాటు దేశవ్యాప్తంగా ఓటర్ ఐడీ విధానాన్ని అమల్లోకి తీసుకురావడం, మెయిల్ లేదా పోస్టల్ ద్వారా ఓటింగ్ నమోదు విధానంపై కఠినమైన ఆంక్షలు విధించేందుకు ఈ బిల్లు తోడ్పడనుంది.

భారత్ ను లాక్ చేసిన డొనాల్డ్ ట్రంప్- సెనెట్ సైతం సై.. !!
భారత్ ను లాక్ చేసిన డొనాల్డ్ ట్రంప్- సెనెట్ సైతం సై.. !!

ఈ చట్టం ద్వారా భవిష్యత్ ఎన్నికల్లో జరిగే అక్రమాలను అరికట్టవచ్చని ట్రంప్ భావిస్తున్నారు. దీనిపై అమెరికాలో రాజకీయ విభేదాలు ఉన్నాయి. డెమోక్రాట్లు ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తోన్నారు. సెనేట్ లో ఈ చట్టాన్ని ఆమోదించే ప్రక్రియ కూడా తాత్కాలికంగా ఆగిపోయింది. దీనిపై భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ సైతం స్పందిస్తూ ట్రంప్ ప్రతిపాదనలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+