సన్‌రైజర్స్ కా సలార్.. !!
ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కంప్లీట్ డామినేషన్ కనిపిస్తోంది. బుధవారం రాత్రి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కు చుక్కలు చూపించింది. అప్పటి వరకు టేబుల్ టాపర్ గా ఉన్న ఈ జట్టును మట్టికరిపించింది. రెండో స్థానానికి దించింది. తాను పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఓ జట్టు సమష్టిగా ఆడితే ఎన్ని విజయాలు సాధించవచ్చో నిరూపించిందీ టీమ్. ఇప్పటివరకు 11 మ్యాచ్ లో ను ఆడిన సన్ రైజర్స్.. ఓడింది నాలుగింట్లో మాత్రమే. ఏడు విజయాలతో 14 పాయింట్లు సాధించింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ట్రావిస్ హెడ్ (19 బంతుల్లో 38), అభిషేక్ శర్మ (13 బంతుల్లో 35) పవర్‌ప్లేలో మరోసారి మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ (43 బంతుల్లో 69), ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 55) సూపర్ ఫాస్ట్ హాఫ్ సెంచరీలు చేశారు. ప్రత్యర్థి జారవిడిచిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. జట్టు భారీ స్కోర్ సాధించడానికి కారకులయ్యారు. గాయం నుంచి కోలుకున్న నితీష్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 29 నాటౌట్) చివర్లో మెరుపులు మెరిపించడంతో సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది.

220 పరుగులకు పైగా లక్ష్యాన్ని కాపాడుకోవడంలో సన్ రైజర్స్ రికార్డు ఈ మ్యాచ్‌తోనూ చెక్కుచెదరలేదు. పంజాబ్ కింగ్స్ ఛేదనలో కూపర్ కొన్నోలీ (57 బంతుల్లో 109 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. తన కెరీర్‌లోని తొలి సెంచరీని సాధించాడు. రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నా, అతనికి మిగిలిన బ్యాటర్ల నుంచి మద్దతు కొరవడింది. దీంతో పంజాబ్ కింగ్స్ కు ఓటమి తప్పలేదు. ఆ జట్టుకు ఇది వరుసగా మూడో ఓటమి. ఈ విజయంతో SRH 14 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలవగా పంజాబ్ 13 పాయింట్లతో రెండో స్థానానికి దిగింది.
ఈ మ్యాచ్ లో కూడా హెన్రిచ్ క్లాసెన్ సునామీ సృష్టించాడు. డే వన్ నుంచీ డ్యూటీ ఎక్కాడు. ఈ సీజన్ లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో టాపర్ ఇతనే. ఆరెంజ్ క్యాప్ ను అందుకున్నాడు. 11 మ్యాచ్‌లలో 494 పరుగులు సాధించాడు. అతని బ్యాటింగ్ సగటు 54.89, స్ట్రైక్ రేట్ 157.32. ఈ సీజన్‌లో అయిదు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. సన్ రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ కు వెన్నెముకగా నిలుస్తూ వస్తోన్నాడు. డెత్ ఓవర్లలో వేగంగా పరుగులు చేస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 36 ఫోర్లు, 23 సిక్సర్లు బాదాడు.
చివరి 11 మ్యాచ్ లల్లో ఆర్సీబీపై 31 (22 బంతులు), కేకేఆర్- 52, లక్నో సూపర్ జెయింట్స్- 62, పంజాబ్ కింగ్స్- 39, రాజస్థాన్ రాయల్స్- 40, చెన్నై సూపర్ కింగ్స్- 59, ఢిల్లీ కేపిటల్స్- 37, రాజస్థాన్ రాయల్స్- 29, ముంబై ఇండియన్స్- 65, పంజాబ్ కింగ్స్- 69 పరుగులు చేశాడు.












Click it and Unblock the Notifications