నల్గొండ: జెడ్పీ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిపై తెలంగాణ జేఏసీ నేతలు ఆదివారం దాడికి దిగారు. రాజీనామా చేసిన వాళ్లు జేడ్పీ సమావేశానికి ఎందుకు హాజరయ్యారని జూలకంటి ప్రశ్నించారని తెలిసింది. దీంతో విద్యార్థులు, ఇతర నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయనపై రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో ఆయనకు స్వల్పగాయలయినట్లు సమాచారం. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి