హైదరాబాద్: రాష్ట్ర విభజనకు అనుకూలంగా తాను చేసిన ప్రకటనను పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమర్థించుకున్నారు. సమైక్యవాదులకు ఆయన సవాల్ విసిరారు. తన అభిప్రాయాలను సమైక్యవాదులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఉత్తరాంధ్రతో పాటు అనంతపురం, మహబూబ్ నగర్ జిల్లాలు ఎందుకు వెనకబడ్డాయో సమైక్యవాదులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఉత్తరాంధ్రలో అభివృద్ధి ప్రారంభమైందని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన జరిగితే ఉపాధి, విద్యావకాశాలపై పర్యవేక్షణ కమిటీ వేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన జరిగితే ప్రత్యేకాంధ్రకు ముఖ్యమంత్రి కావాలన్న ఆశ తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన వల్ల తమకేమీ నష్టం లేదని శ్రీకృష్ణ కమిటీకి తాను చెప్తానని ఆనయ అన్నారు. ఇన్నాళ్లు కండ బలం ఉన్న ప్రాంతాలనే అభివృద్ధి చేశామని ఆయన అభిప్రాయపడ్డారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి