తిరుపతి: దాదాపు 1800 మందికి పైగా ప్రముఖ వేద పండితులతో తిరుపతిలో అంతర్జాతీయ వేద సమ్మేళనం జరగనుంది. వేదిక్ విశ్వవిద్యాలయం ఆవరణలో మార్చి 3 నుంచి 5 తేదీ వరకు ఈ సమ్మేళనం జరుగుతుంది. ఈ మేరకు వర్శిసిటీ ఆవరణలో దేవస్ధానం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమ్మేళనాన్ని వేదిక్ విశ్వవిద్యాలయం, తిరుమల తిరుపతి దేవస్థానాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. భాతరదేశ చరిత్రలోనే అత్యంత ప్రాధాన్యత గల సమ్మేళనం నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. ఈ సమ్మేళన కార్యక్రమంలో 1800 మందికి పైగా ప్రముఖ వేద పండితులు హాజరు కానున్నారు. వీరిలో అమెరికా, జపాన్, నేపాల్, ఇటలీ దేశాలకు చెందిన వేద పండితులు కూడా పాల్గొననున్నారు. ఈ సమ్మేళనం సంస్కృతం, తెలుగు, ఆంగ్లభాషల్లో నిర్వహించేందుకు వేదికలను సిద్ధం చేస్తున్నారు. ఇది విజయవంతమవుతుందని ప్రతీ సంవత్సరం ఇటువంటి సమ్మేళనం ఏర్పాటు చేస్తామని దేవస్ధానం తెలుపుతోంది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి