IPL 2026: కొంపముంచిన రిషభ్ పంత్.. లక్నో ఖేల్‌ఖతమ్!

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు తమ వరుస ఓటములకు ముగింపు పలికింది. వరుసగా మూడు పరాజయాల తర్వాత విజయాన్ని నమోదు చేసింది. సోమవారం వాంఖడే మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసింది.

గాయం నుంచి కోలుకొని రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ కూడా సత్తా చాటడంతో ముంబై 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఓటమితో లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. 9 మ్యాచ్‌ల్లో 7 ఓటములతో ముంబై ఇండియన్స్‌‌తో కలిసి ఇంటిబాట పట్టింది. ఈ మ్యాచ్‌లో గెలిచినా ముంబై ఇండియన్స్‌కు ఒరేగిది ఏం లేదు. ముంబై 9వ స్థానంలో, లక్నో 10వ స్థానంలో కొనసాగుతున్నాయి.

ఓపెనర్ల విధ్వంసం..

229 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్(32 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 83), రోహిత్ శర్మ(44 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 84) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నారు. నమన్ ధీర్(12 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్2తో 23 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. లక్నో బౌలర్లలో మణిమరన్ సిద్దార్థ్(2/47) రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, మోహ్‌సిన్ నఖ్వీ చెరో వికెట్ పడగొట్టారు.

IPL 2026 Rishabh Pant Batting Struggle Costs LSG as MI Victory Knocks Lucknow Out of Playoff Race

పాపం పూరన్..

అంతకుముందు లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. నికోలస్ పూరన్(21 బంతుల్లో ఫోర్, 8 సిక్స్‌లతో 63) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా.. మిచెల్ మార్ష్(25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44), ఎయిడెన్ మార్క్‌రమ్(25 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 31 నాటౌట్), హిమ్మత్ సింగ్(31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్) విలువైన పరుగులు జోడించారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో కార్బిన్ బోష్(2/20) రెండు వికెట్లు తీయగా.. అల్లా ఘజన్‌ఫర్, విల్ జాక్స్, రఘు శర్మ తలో వికెట్ తీసారు.


లక్నో కొంపముంచిన పంత్..

రిషభ్ పంత్ బ్యాటింగ్ వైఫల్యం లక్నో విజయవకాశాలను దెబ్బతీసింది. నికోలస్ పూరన్ విధ్వంసంతో 8.1 ఓవర్లలో లక్నో 123 పరుగులు చేసింది. కానీ ఆ తర్వాత వచ్చిన పంత్(15), అక్షత్ రఘువంశీ(11) తీవ్రంగా నిరాశపర్చగా.. మార్క్‌రమ్, హిమ్మత్ సింగ్ దూకుడుగా ఆడలేకపోయారు. దాంతో లక్నో తమ లక్ష్యానికి 20-30 పరుగులు తక్కువగా చేసింది. ఆ తర్వాత బౌలింగ్‌లో ముంబై ఓపెనర్లను ఔట్ చేయలేక మూల్యం చెల్లించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+