కేవలం విజయ్ కట్ అవుట్ తో ప్రచారం.. ఎమ్మెల్యేగా తిరుగులేని విజయం..
తమిళనాడులోని కుంభకోణం నియోజకవర్గం ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. కేవలం విజయ్ కట్ ఔట్ మీద అక్కడి టీవీకే అభ్యర్థి వినోద్ సంచలన విజయం సాధించారు. కుంభకోణం నియోజకవర్గంలో విజయ్ హోలోగ్రామ్ కట్ ఔట్ మీద ప్రచారం చేసిన టీవీకే పార్టీ అభ్యర్థి వినోద్ 679 ఓట్లతో విజయం సాధించడం విజయ్ స్టామినా ఏంటో మరోసారి రుజువు చేసింది. అంతకుముందు విజయ్ డ్రైవర్ కుమారుడు శబరినాథన్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అలాగే టీవీకే పార్టీ తరఫున రోయపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆటో డ్రైవర్ విజయ్ ధాము సంచలన విజయం సాధించారు. వీళ్ల విజయంతో విజయ్ కు తమిళనాడు ప్రజలు ఏ రేంజ్ లో మద్దతు పలికారో స్పష్టం అవుతుంది.
తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో దళపతి విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. టీవీకే పార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ తమిళనాడులో సంచలనం సృష్టించింది. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన టీవీకే పార్టీ 107 స్థానాల్లో విజయం సాధించింది. అధికార డీఎంకే 74 స్థానాలకు పరిమితం అయింది. అన్నాడీఎంకే 53 స్థానాలను కైవసం చేసుకుంది. విజయ్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఇంకా కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కావాలి.

ఇక ఈ ఎన్నికల్లో అందరినీ దృష్టిని ఆకర్షించిన కుంభకోణం నియోజకవర్గం టీవీకే అభ్యర్థి వినోద్ విజయం సాధించారు. డీఎంకే అభ్యర్థిపై 679 స్వల్ప ఓట్ల తేడాతో గెలుపొందారు. కుంభకోణంలో విజయం ఖాయం అని భావించిన డీఎంకే పార్టీకి ఇది పెద్ద దెబ్బ. అయితే వినోద్ ఎన్నికల ప్రచారంలో విజయ్ పాల్గొనలేదు. దాంతో విజయ్ హోలోగ్రామ్ కట్ ఔట్ మీద ప్రచారం చేసిన వినోద్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించడం విజయ్ మద్దతుకు నిదర్శనంగా చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications