కర్నూలు: కర్నూలు జిల్లాలోని శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం క్యూలైన్ లో శనివారం తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. ఉగాది మహోత్సవాల సందర్భంగా దాదాపు లక్ష మంది భక్తులు శ్రీశైలానికి తరలి వచ్చారు. వారికి సరిపడా సౌకర్యాలు ఏర్పాటు చేయక పోవడం వల్లనే ఈ తొక్కిసలాట జరిగినట్లు భావిస్తున్నారు.
కర్నాటక నుంచి శ్రీశైలానికి భక్తులు వెల్లువెత్తారు. భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆలయ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.