హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు, రోశయ్య కుమ్మక్కయ్యారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah-Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కె. రోశయ్య, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుమ్కక్కయ్యారా? వీరిద్దరూ కుమ్మక్కయ్యారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు పదే పదే విమర్శలు చేస్తున్నారు. అయితే, ఈ ఆరోపణను ముఖ్యమంత్రి రోశయ్య ఖండించారు. చంద్రబాబుతో కుమ్మక్కయ్యే వయస్సు తనది కాదని, తమ మధ్య వయో వ్యత్యాసం చాలా ఉందని ఆయన ఇంతకు ముందు అన్నారు. అయినా తెరాస నాయకులు తమ విమర్శలను విరమించుకోలేదు. తెలంగాణ విషయానికి వచ్చేసరికి సీమాంధ్ర నాయకులంతా ఒక్కటేననే అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో ఉంది. తెలంగాణకు వ్యతిరేకంగా వారంతా ఒక్కటవుతారని కూడా వారు గట్టిగా నమ్ముతున్నారు. దీంతో రోశయ్య, చంద్రబాబు కుమ్మక్కయ్యారని విమర్సలు చేయడం ద్వారా తెలంగాణలో ఆ ఇద్దరు రాజకీయ నాయకులను బలహీనపరిచే ఉద్దేశం తెరాసకు ఉందని అనుకోవాలి. శాసనసభా సమావేశాలు సజావుగా నడవడానికి వారిద్దరు కుమ్మక్కు కావడం ఒక నిదర్శనమని తెరాస నాయకుడు హరీష్ రావు తాజాగా విమర్శించారు.

కాగా, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కడప కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కూడా రోశయ్యతో రాజీకి వచ్చినట్లు చెబుతున్నారు. రోశయ్యకు సహకరించడం ద్వారా తన పార్టీ అధిష్టానం పట్ల తన విధేయతను చాటుకోవాలనేది ఆయన ఉద్దేశమని చెబుతున్నారు. ఇప్పుడు ఎలాగూ ముఖ్యమంత్రి పీఠం దక్కే అవకాశాలు లేవు కాబట్టి రోశయ్యకు సహకరించడం ద్వారా భవిష్యత్తులో మంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలనేది ఆయన లక్ష్యంగా చెబుతున్నారు. రోశయ్యపై తీవ్ర విమర్శలు చేసిన తెలుగుదేశం నాయకులపై జగన్ కు చెందిన పది మంది కడప శాసనసభ్యులు కొట్టిపారేస్తూ తీవ్రంగా మాట్లాడడం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు.

మొత్తం మీద, అన్ని విధాలుగా, అన్ని వైపుల నుంచి రోశయ్యకు సహకారం అందుతోందని అభిప్రాయం ఉంది. దీంతో ఆయన తన స్థానాన్ని పటిష్టపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్థితిలో ఏప్రిల్ మొదటివారంలో మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ కూడా చేపట్టే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X