మంత్రి వర్గ విస్తరణ ఉంటుంది: మొయిలీ

సోమవారం పార్లమెంట్‌కు వచ్చిన ముఖ్యమంత్రి కె. రోశయ్యను మీడియా ప్రతినిధులు కలిశారు. మంత్రివర్గ విస్తరణ అధ్యాయం ముగిసినట్లేనా? అని మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ "విస్తరణ అంటే చాలా గ్రౌండ్ వర్క్ చేయాలి కదా!" అన్నారు. తమది జాతీయ పార్టీ అంటూ అందుకు సమయం పడుతుందని చెప్పారు. మేడమ్ ను తాను ఢిల్లీ రాగానే కలుసుకున్నాని, ఎప్పుడు విస్తరణ చేయాలో అధిష్ఠానం నిర్ణయిస్తుందని తెలిపారు. అందుకు 15 రోజులు పడుతుందా? అని అడిగినప్పుడు "అది మీరో నేనో నిర్ణయించేదైతే..15 రోజులెందుకు? రేపే చేయవచ్చు కదా!" అన్నారు. మంత్రివర్గ విస్తరణ తర్వాతే కార్పొరేషన్, ఇతర పదవులను భర్తీ చేస్తామని వెల్లడించారు. విస్తరణ తేలకుండా ఇతర పదవుల నియామకం ఎలా చేస్తాం? అని ఆయన అన్నారు.
మంత్రివర్గ విస్తరణ సరైన సమయంలో జరుగుతుందని, అయితే ఫలానా సమయంలో జరుగుతుందని తాను చెప్పలేనని వీరప్ప మొయిలీ వ్యాఖ్యానించారు. విస్తరణ జరుగుతుందని, అయితే ఎప్పుడు అన్నదే నిర్ణయించాల్సి ఉందని ఆయన చెప్పారు. కౌన్సిల్, రాజ్యసభ ఎన్నికల వరకు ఆగుతారా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ఆయన నిరాకరించారు. కొందర్ని మంత్రివర్గంలో చేర్చుకుంటారా, లేక పూర్తి స్థాయి విస్తరణ జరుగుతుందా అని అడిగినప్పుడు అసలు సమయం నిర్ణయం కానప్పుడు ఏ స్థాయి విస్తరణ ఉంటుందో ఎలా చెబుతానని మొయిలీ ఎదురు ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications