తెలంగాణపై బాబు స్పష్టత ఏమిటి?

సీమాంధ్ర వ్యక్తిగత అభిప్రాయాలు పార్టీ వైఖరిని అధిగమించి ఎందుకు వ్యక్తమవుతున్నాయనేది, దాన్ని చంద్రబాబు ఎందుకు అనుమతిస్తున్నారనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. పార్టీ వైఖరి స్పష్టంగా ఉన్నప్పుడు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి పార్టీ తరఫున ఒకే నివేదికను ఎందుకు సమర్పించలేదనేది మరో ప్రశ్న. ఇటు తెలంగాణ నాయకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని, అటు సీమాంధ్ర నాయకులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని శ్రీకృష్ణ కమిటీకి నివేదికలు సమర్పించారు. దీన్ని పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదు. అంటే, సీమాంధ్ర నాయకులను కట్టడి చేసే స్థితిలో ఆయన లేరని భావించాల్సి ఉంటుంది. లేదంటే, తెలంగాణకు అనుకూలమంటూనే సమైక్యవాదాన్ని బలపరిచేందుకు ఆయన సిద్ధపడి ఉండాలని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications