మా తెలంగాణ వైఖరి స్పష్టం: చంద్రబాబు

Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణపై తమ వైఖరి స్పష్టంగా ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా అధికార కాంగ్రెసు పార్టీ నాయకులు తమను విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. నిత్యావసర సరుకుల ధరలపై వామపక్షాల నాయకులతో చర్చించిన అనంతరం ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రభుత్వ అసమర్థత వల్ల, ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్ల సరుకుల ధరలు పెరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ధరల పెరుగుదలను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన అన్నారు.

రాష్ట్రాన్ని కాంగ్రెసు భ్రష్టు పట్టిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ధరల పెరుగుదలపై అన్ని పార్టీలతో కలిసి తాము పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. ధరల పెరుగుదలపై ప్రజలను చైతన్యం తెచ్చి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ప్రచారం సాగిస్తామని ఆయన అన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 24వ తేదీన సైకిల్ ర్యాలీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 27వ తేదీన ప్రతిపక్షాలు చేపట్టిన హర్తాళ్ ను విజయవంతం చేయాలని ఆయన ప్రజలను కోరారు. ప్రభుత్వం మధ్య దళారులను పెంచి పోషిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+