అహ్లూవాలియాతో రోశయ్య సమావేశం

గత రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్న రోశయ్య కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని, కేంద్ర మంత్రి, పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల మంత్రి వీరప్ప మొయిలీని కలుసుకున్నారు. కాంగ్రెసు రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ తో కూడా ఆయన సమావేశమయ్యారు. మంత్రి వర్గ విస్తరణకు పార్టీ అధిష్టానం నుంచి ఆమోదం పొందేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, ఆయన ఉపరితల రవాణా శాఖ మంత్రి కమల్నాథ్ తో కూడా రోశయ్య సమావేశమవుతారు.












Click it and Unblock the Notifications