నక్సల్స్ కు ఆయుధాలిస్తున్న ముఠా అరెస్టు

ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆయుధ వ్యాపారి సునీల్ కుమార్ తోపాటు మాజీ నక్సలైట్ దేవేందర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సునీలో తో మోహనన్న బృందానికి దేవేందర్ ఒప్పందం కుదిర్చినట్లు పోలీసులు గుర్తించారు. వారి నుంచి పోలీసులు ఒక ఎకె 47, స్ప్రీంగ్ ఫీల్డ్ రైఫిల్, దేశవాళి పిస్టల్, 676 తూటాలు, 12 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అవి కండీషన్ లోనే ఉన్నాయని మెదక్ ఎస్పీ సజ్జనార్ చెప్పారు.
ఇదిలా వుంటే, ఖమ్మం జిల్లా గుండాల అటవీ ప్రాంతంలో ప్రజా ప్రతిఘటనకు చెందిన దళ కమాండర్ మోహనన్న మీద దళ సభ్యుడు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దీని నుంచి మోహనన్న తప్పించుకున్నట్లు చెబుతున్నారు. కాల్పులు జరిపిన దళ సభ్యుడు పరారైనట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications