థరూర్ ఉద్వాసన విపక్షాల జయం: బాబు

ప్రతిపక్షాలు జాతీయ స్థాయిలో ఆందోళనలకు శ్రీకారం చుట్టినా ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర సరుకులపై సర్వీసు టాక్స్ ను ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ లపై మన రాష్ట్రంలోనే పన్ను అధికంగా ఉందని ఆయన చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆయన అన్నారు. తెల్ల రేషన్ కార్డులను ప్రభుత్వం ఏరేస్తోందని, సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయడం లేదని ఆయన విమర్శించారు. ధరలను తగ్గించే విషయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించడం లేదని ఆయన అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ తదితరులు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.












Click it and Unblock the Notifications