సాఫ్ట్ వేర్ ఉద్యోగి దారుణ హత్య

ఇతనికి మూడు సంవత్సరాల క్రితం ఉప్పల్ కు చెందిన రమేష్ కుమార్తె స్వరూపరాణితో వివాహం జరిగింది. అయితే ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదన్న కారణంతో దినకర్ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా ఆ కేసు నడుస్తోంది. ఇంటి పైపోర్షన్‌లో దినకర్ ఒంటరిగా ఉంటుండగా. కింద పోర్షన్ ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఈ క్రమంలో సోమవారం పలుమార్లు ఫోన్ చేసినా దినకర్ ఫోన్‌ను ఎత్తకపోవడంతో తల్లి లకి ఉదయం 11 గంటలకు వనస్థలిపురంలోని ఇంటికి చేరుకుంది. తలుపు బయటినుంచి గడియ పెట్టివుండడంతో లోనికెళ్లి చూడగా దినకర్ మృతిచెంది కనిపించాడు. వెంటనే ఫోన్ లో భర్త పార్థసారధికి సమాచారం అందించగా ఆయన వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దినకర్‌ను ఎవరు చంపారనేది మిస్టరీగా మారింది. అతని చేతికి ఉన్న బంగారు బ్రాస్ లెట్, సెల్ఫ్‌లో ఉన్న ఉంగరాలు అలాగే ఉండడం, 'లేబ్రా' జాతి కి చెందిన భారీ సైజు కుక్క ఇంటిలోనే ఉండడం వల్ల ఇది దొంగలపని కాదని తెలుస్తోంది. దినకర్ ఒంటిపై నూలుపోగు లేకుండా చేసి, గొంతు కోసి, మొఖం చెక్కేసి చంపడాన్నిబట్టి చూస్తే అతనిపై తీవ్ర కక్షను పెంచుకున్న వారి పనిగా తోస్తోంది. తన కుమారునికి అత్తింటి వారితో వివాదాలు ఉన్నాయని, రెండు రోజుల క్రితం అతని మామ ఫోన్ లో బెదిరించినట్లు దినకర్ చెప్పాడని తండ్రి పార్థసారధి తెలిపారు.












Click it and Unblock the Notifications