హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరెంట్ చార్జీల పెంపునకు కేబినెట్ ఓకె

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: పరిశ్రమలకు, వాణిజ్య సంస్థలకు విద్యుత్ చార్జీలను పెంచాలనే విద్యుత్ నియంత్రణ మండలి (ఇఆర్సీ) ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కె. రోశయ్య అధ్యక్షతను గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆ ఆమోదం లభించింది. యూనిట్ కు 50 పైసల చొప్పున విద్యుత్ చార్జీలు పెరుగుతాయి. పెరిగిన విద్యుత్ చార్జీలు ఆగస్టు నుంచి అమలులోకి వస్తాయి. గృహావసరాల వినియోగంపై విద్యుత్ చార్జీలు పెంచడం లేదు. అలాగే పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా బాండ్లు జారీ రెండు వెల కోట్ల రూపాయలు సమీకరించాలనే ప్రతిపాదనను కూడా మంత్రి వర్గం ఆమోదించింది.

వైద్యశాఖలో 1,700 వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. విజయనగరం జిల్లా మినీ జలవిద్యుత్ ప్రాజెక్టుకు పది ఎకరాల భూమీని కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఐఐఐటిలో మూడు వేల సీట్లను తగ్గించాలని కూడా మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. 2010 - 15 గిరిజన సాధికారత విదానానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో కాన్పులో కవలలు పుట్టినవారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు మంత్రివర్గం అర్హత కల్పించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X