హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ లో గల భాస్కర మెడికల్ కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచార యత్నం జరిగింది. అదే కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. అత్యాచార యత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న రాము, భద్రి, శ్రీనివాస్ అనే విద్యార్థులు పరారీలో ఉన్నారు. కళాశాలలో ఈ నెల 24వ తేదీన ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తనపై ముగ్గురు విద్యార్థులు సామూహిక అత్యాచార యత్నానికి పాల్పడిన సంఘటనపై విద్యార్థిని పోలీసులకు బుధవారంనాడు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.