షాక్ తో కుప్పకూలిన కసబ్

కరడుగట్టిన పాకిస్థానీ ఉగ్రవాది, 26/11 ముంబై దాడుల దోషి అజ్మల్ అమీర్ కసబ్‌కు మరణశిక్ష విధిస్తూ ఇక్కడి ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ స్వాగతించారు. ఈ శిక్ష ద్వారా ముంబై దాడుల బాధితులకు ఊరట కలుగుతుందని ఈ కేసులో ప్రభుత్వం తరపున వాదించిన ఆయన తెలిపారు. కసబ్ ముసలి కన్నీరు కారుస్తున్నాడని, ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ఎంతో ప్రయత్నించడాని తెలిపారు. పాముకు ఎంతగా పాలు పోసి సాకినా, అది విషమే కక్కుతోందని, అలాగే దుర్జనుడిగా సాయం చేసినా తన నైజాన్ని మరవక పాత విధానమే అవలంబిస్తాడని ఈ సందర్భంగా ఓ ఆర్యోక్తిని ప్రస్తావించారు. కసబ్‌కు ఉరిశిక్ష పడడం దేశ ప్రజలందరి విజయమని తెలిపారు.












Click it and Unblock the Notifications