మెదక్: మెదక్ జిల్లా కొండాపూర్ మండలం అనంతసాగర్‌లో జంట హత్యలు చోటుచేసుకున్నారు. తాగిన మైకంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ చివరికి హత్యల వరకూ దారితీశాయి. మద్యం మత్తులో ఏసయ్య అనే వ్యక్తిని జైపాల్ హతమార్చాడు.
ఈ విషయం తెలుసుకున్న ఏసయ్య బంధువులు జైపాల్ ను గొడ్డళ్లతో దాడి చేసి సజీవ దహనం చేశారు. ఈ జంట హత్యలు స్థానికంగా కలకలాన్ని సృష్టించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.