విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా గాజువాకలో పోలీసులు శనివారం విలువైన రంగురాళ్లను పట్టుకున్నారు. వాటి ఖరీదు 20 లక్షల రూపాయల దాకా ఉంటుందని అంచనా. ఇందుకు సంబంధించి నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు గుజరాతీలు.
రంగురాళ్ల అక్రమ రవాణా జరుగుతుందనే సమాచారం అందడంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల సందర్భంగా అనుమానస్పదంగా కనిపించిన గుజరాతీలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో అసలు విషయం బయటపడింది.