చర్చలకు మావోలకు చిదంబరం పిలుపు

ఎజెండాలో మావోయిస్టులు ఏమైనా చేర్చవచ్చునని, అయితే చర్చల కాలంలో హింసకు పాల్పవడవద్దని ఆయన అన్నారు. ఈ కాలంలో ప్రభుత్వం కూడా ఏ విధమైన ఆపరేషన్ చేపట్టదని ఆయన హామీ ఇచ్చారు. ఇంతకు ముందు ప్రభుత్వం కూడా సమస్యను తక్కువ అంచనా వేసిందని ఆయన అన్నారు. నక్సలిజాన్ని అదుపు చేయడానికి రెండు, మూడేళ్లు పడుతుందని ఆయన చెప్పారు. తాము వైమానిక దాడుల గురించి మాట్లాడడం లేదని ఆయన చెప్పారు. తనకు ఉన్న పరిమితుల్లో చర్యలు తీసుకుంటున్నానని, విస్తృత చర్యల కోసం కేంద్ర క్యాబినెట్ కమిటీలో చర్చిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications