జగన్ కు కళ్లెం: రోశయ్యకు భరోసా

అవసరమైతే సోనియాను కూడా నిలదీస్తామని జగన్ వర్గానికి చెందిన గుర్నాథ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు చేసిన వ్యాఖ్యను పార్టీ అదిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఆ వ్యాఖ్యలు చేసిన నాయకులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడానికి సిద్ధపడింది. ముఖ్యమంత్రి రోశయ్య సోమవారం కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. ఆ తర్వాత స్వరం పెంచి పార్టీలోని ప్రత్యర్థులకు హెచ్చరికలు చేశారు. కఠినంగా వ్యవహరించాలని, మీ వెంట మేముంటామని అధిష్టానం ఇచ్చిన హామీతో ఆయన కటువుగా మాట్లాడినట్లు తెలుస్తోంది.
జగన్ కు వ్యతిరేకంగా పార్టీలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని భావించడంతో వైయస్ అనుంగు మిత్రుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు వీరప్ప మొయిలీని కలిశారు. సంక్షేమ పథకాలపై జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications