వైయస్ జగన్ డైలమా: తిరుగుబాటా, సర్దుబాటా?

YS Jagan
హైదరాబాద్: ఓదార్పు యాత్రకు వ్యతిరేకంగా పార్టీ అధిష్టానం స్పష్టమైన వైఖరిని ప్రకటించడంతో కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ డైలమాలో పడినట్లున్నారు. తన ఓదార్పు యాత్ర వ్యక్తిగతమని చెప్పినా పార్టీ అధిష్టానం అనుమతి ఇవ్వకపోవడం ఆయనను తీవ్రంగా కలతకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం నాడు ఆయన భవిష్యత్తు కార్యాచరణపై తన సన్నిహితులతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఓదార్పు యాత్ర ఆగదని జగన్ శిబిరం చెబుతున్నప్పటికీ అధిష్టానాన్ని ధిక్కరించి ముందుకు పోవడం వల్ల ఎదురయ్యే పరిణామాలపై ఆలోచన చేస్తోంది.

పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి, భవిష్యత్తులో తాను చేయాల్సిందేమిటనే విషయాలపై జగన్ ఆంతరంగికులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. జగన్ పార్టీ పెడతారని ఓ వైపు, బిజెపిలో చేరుతారని మరో వైపు ప్రచారం సాగుతోంది. అయితే, ఈ విషయంలో జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెసు పార్టీలో కొనసాగడానికే ఆయన మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. జగన్ సన్నిహితులు కూడా ఈ విధమైన సంకేతాలనే ఇస్తున్నారు. మంత్రి దానం నాగేందర్ చేసిన ప్రకటన, రాయచోటి శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన వివరణ అందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి.

ముఖ్యమంత్రి కె. రోశయ్యను జగన్ కించపరచలేదని శ్రీకాంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. తనకన్నా చిన్నవారిని కూడా అన్నా పిలిచే సంస్కారం జగన్ కు ఉందని, అందువల్ల ముఖ్యమంత్రిని అవమానించే విధంగా జగన్ మాట్లాడరని ఆయన అన్నారు. జగన్ కాంగ్రెసు కుటుంబంలో సభ్యుడని, జగన్ వెంట పార్టీ ఉందని దానం నాగేందర్ అన్నారు. దీన్ని బట్టి జగన్ శిబిరం సర్దుబాటుకే మొగ్గు చూపుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+