వచ్చి కలుస్తాం: సోనియాకు వైయస్ విజయమ్మ లేఖ

YS Vijayalakshmi
హైదరాబాద్: 'నా భర్త వైయస్ రాజశేఖర రెడ్డి మృతి చెంది నేటికి తొమ్మిది నెలలైంది. ఈ మధ్యకాలంలో కుటుంబ సభ్యులైన మాకు పార్టీ పరంగా ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అనేక సందర్భాల్లో ఆవేదనకు గురయ్యాం. మీకు తెలియకుండా ఇక్కడ చాలా జరుగుతున్నాయి. అవకాశమిస్తే వచ్చి కలుస్తాం" అని వైయస్ సతీమణి విజయలక్ష్మి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసినట్లు విశ్వసనీయంగా తెలిసిందంటూ ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది.

వైయస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించడం కోసం తన కుమారుడు జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రకు అధిష్ఠానం నుంచి చుక్కెదురైన నేపథ్యంలో విజయలక్ష్మి ఈ లేఖ రాయడం విశేషమని ఆ పత్రిక వ్యాఖ్యానించింది. "నా కుమారుడైన కడప ఎంపీ జగన్ బాధిత కుటుంబాలను కలిసేందుకు కూడా ఆటంకాలు కల్పించడం బాధ కల్గిస్తోంది. అందుకే ఈ లేఖ ద్వారా మా ఆవేదనను మీకు తెలియజేస్తున్నాను. అవకాశం ఇస్తే స్వయంగా కలిసి మొత్తం పరిస్థితిని వివరిస్తాను' అని ఆమె తన లేఖలో అధ్యక్షురాలికి విన్నవించినట్లు తెలిపింది.

బుధవారం ఉదయం విజయమ్మ సోనియాకు లేఖ రాసినట్లు ఆ పత్రిక రాసింది. వైయస్ మరణించి సరిగ్గా తొమ్మిది నెలలు పూర్తి కావడంతో ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ, పార్టీ పరంగా తమ కుటుంబ సభ్యులకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారని తెలిపింది. ప్రధానంగా జగన్ ఓదార్పు యాత్రకు బ్రేక్ వేయ డం గురించి ప్రస్తావించినట్లు రాసింది. ఇది జగన్‌ను, తమ కుటుంబ సభ్యులను ఎంతగా ఆవేదనకు గురి చేసిందీ వివరించినట్లు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, పార్టీలో జరుగుతున్న పరిణామాలను సవివరంగా తెలిపేందుకు ప్రయత్నించినట్లు ఆ పత్రిక వార్తా కథనం తెలియజేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+