న్యూఢిల్లీ: తమ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి వివరించినట్లు రాజ్యసభకు ఎన్నికైన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చెప్పారు. సతీమణి రాజ్యలక్ష్మితో కలిసి ఆయన మంగళవారం సోనియా గాంధీని కలుసుకున్నారు. సోనియాను తాము మర్యాదపూర్వరంగానే కలుసుకున్నామని, రాజ్యసభ సీటు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపామని నేదురమల్లి భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు.
రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడాల్సిన అవసరం ఉందని, అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. సోనియాకు రాష్ట్రంలోని తాజా పరిస్థితులను వివరించినట్లు ఆయన తెలిపారు.