ముఖ్యమంత్రి రోశయ్యది ఐరన్ లెగ్ కన్నా ఎక్కువే: గాలి

రోశయ్య ప్రభుత్వంలో వైయస్ రాజశేఖర రెడ్డి హయంలో కన్నా ఎక్కువ అవినీతి చోటు చేసుకుందని ఆయన విమర్శించారు. మద్యం టెండర్లలో ముఖ్యమంత్రి రోశయ్యకు పది వేల కోట్ల ముడుపులు ముట్టాయని ఆయన ఆరోపించారు. ప్రజలపై రోశయ్య ప్రభుత్వం 40 వేల కోట్ల రూపాయల భారం వేశారని ఆయన అన్నారు. రోశయ్య సంక్షేమ పథకాల్లో కోత విధిస్తున్నారని, ప్రజలపై పన్నుల భారం వేస్తున్నారని ఆయన అన్నారు. రోశయ్య పేరును రోతలయ్యగానో, కోతలయ్యగానో, మోతలయ్యగానో మార్చుకుంటే మంచిదని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications