మావోల మెరుపు దాడి: 26 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల మృతి

Maoists
రాయపూర్: ఛత్తీస్‌ గఢ్ ‌లో మావోయిస్టులు మరోసారి విరుచుకుపడ్డారు. నారాయణ్ ‌పూర్‌ జిల్లా దౌడాయ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జారాఘాటీ అడవుల్లో మంగళవారం సాయంత్రం మెరుపుదాడికి పాల్పడి 26 మంది సీఆర్‌ పీఎఫ్‌ జవాన్లను కాల్చిచంపారు. నలుగురు జవాన్లు, నలుగురు ఎస్‌పీవోలు తీవ్రంగా గాయపడ్డారు. మూడు నెలల క్రితం జరిగిన చింతల్‌నార్‌ ఘటన తరహాలోనే నక్సల్స్‌ మొదట మందు పాతరలు పేల్చి తర్వాత కొండల మీద నుంచి కాల్పులు జరుపుతూ సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను చుట్టుముట్టారు. రోజంతా గాలింపుల్లో పాల్గొని, అలసిపోయి అదేదారిలో తిరిగివస్తున్న 63 మంది జవాన్లు మెరుపుదాడికి బిత్తరపోయారు. వెంటనే తేరుకొని ఎదురు కాల్పులు జరిపారు. మూడు దఫాలుగా నాలుగు గంటలపాటు హోరాహోరీ పోరు జరిగింది.

జవాన్లు కాల్పుల విరామంలో వేరే మార్గంలో బయటపడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. నక్సల్స్‌ అన్ని వైపులా చుట్టుముట్టారు. చీకటి పడటం, పరిసరాలపై నక్సల్స్‌కు మెరుగైన అవగాహన ఉండటం, నక్సల్స్‌ బలగాలు 200 మందికి మించి ఉండటం, స్థానికులు కూడా దాడిలో పాల్గొనడంతో నక్సల్స్‌దే పైచేయి అయ్యింది. నక్సల్స్‌ వైపు నుంచి ఎంతమంది మరణించిందీ తెలియరాలేదు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జవాన్లను నారాయణపూర్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇద్దర్ని హెలికాప్టర్ల ద్వారా జగదల్‌పూర్‌కు, ఆ తర్వాత రాయ్‌పూర్‌కు తరలించారు. కొంతమంది ఆచూకీ తెలియలేదు. దాంతో మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+